కర్త - కర్మ బ్లాగ్ వీక్షకులకు నమస్కారం ! భగవత్ గీత లో చెప్పినట్టు , ఎవరి కర్మ కు వాలే బాధ్యులు , ప్రతి వ్యక్తి జీవితం వారి కర్మానుసారం నడుస్తుంది. ఇక్కడ మనం కేవలం నిమిత్త మాత్రులం. ఆ భగవంతుడే దీనికి కర్త - కర్మ. నువ్వు నీ పని చెయ్ , ఫలితం గురించి ఆలోచించకు అని గీత లో శ్రీ కృష్ణుడు చెప్పాడు. అవును అది నిజం. ఈ సృష్టి లో ప్రతీది కర్మ ప్రకారం జరుగుతుంది. దానిని ఎవరు మార్చలేరు. ఎవరు బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి తప్పదు. అందుకే నేను ఈ బ్లాగ్ ప్రారంభించాను. మనం ప్రస్తుతం కరోనా అనే మహా ప్రళయాన్ని చూస్తున్నాం ఎంతో మంది దీనికి బలౌతున్నారు, ఇది మన కర్మ మనుసులు అత్యాశకు ఇది నిదర్శనం. మన నాశనాన్ని మనమే సృష్టించుకున్నాం , కావున అనుభవించాలి తప్పదు. అలాగని చేతులు కట్టుకుని కూర్చోలేం కదా ఏదోటి చేయాలీ కానీ ఏమి చేయలేని పరిస్థితి, ఇది చాలామంది అనుకునే మాట నిజమే మనం ఏమి చేయలేము కానీ మనకు తెలిసిన విషయాని ఇంకొకరికి చేరవేయచ్చు కదా, ఇప్పుడు ఇది చాలా అవసరం చాల మందికి కరోనా వస్తే ఎం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు మనల్ని కాపాడుతారు, ఏ మందులు వాడాలి ఇలా అన్ని చాల డౌట్స్ ఉన్నాయి, చాల ...