KARTHA-KARMA
కర్త - కర్మ బ్లాగ్ వీక్షకులకు నమస్కారం !
భగవత్ గీత లో చెప్పినట్టు , ఎవరి కర్మ కు వాలే బాధ్యులు , ప్రతి వ్యక్తి జీవితం వారి కర్మానుసారం నడుస్తుంది. ఇక్కడ మనం కేవలం నిమిత్త మాత్రులం. ఆ భగవంతుడే దీనికి కర్త - కర్మ. నువ్వు నీ పని చెయ్ , ఫలితం గురించి ఆలోచించకు అని గీత లో శ్రీ కృష్ణుడు చెప్పాడు. అవును అది నిజం. ఈ సృష్టి లో ప్రతీది కర్మ ప్రకారం జరుగుతుంది. దానిని ఎవరు మార్చలేరు. ఎవరు బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి తప్పదు. అందుకే నేను ఈ బ్లాగ్ ప్రారంభించాను.
మనం ప్రస్తుతం కరోనా అనే మహా ప్రళయాన్ని చూస్తున్నాం ఎంతో మంది దీనికి బలౌతున్నారు, ఇది మన కర్మ మనుసులు అత్యాశకు ఇది నిదర్శనం. మన నాశనాన్ని మనమే సృష్టించుకున్నాం , కావున అనుభవించాలి తప్పదు. అలాగని చేతులు కట్టుకుని కూర్చోలేం కదా ఏదోటి చేయాలీ కానీ ఏమి చేయలేని పరిస్థితి, ఇది చాలామంది అనుకునే మాట నిజమే మనం ఏమి చేయలేము కానీ మనకు తెలిసిన విషయాని ఇంకొకరికి చేరవేయచ్చు కదా, ఇప్పుడు ఇది చాలా అవసరం చాల మందికి కరోనా వస్తే ఎం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు మనల్ని కాపాడుతారు, ఏ మందులు వాడాలి ఇలా అన్ని చాల డౌట్స్ ఉన్నాయి, చాల మంది డాక్టర్స్, స్పెషలిస్ట్ లు వారి సలహాలు ఇస్తున్నారు , అలాగే ఏంటో మంది స్వచంద సంస్థ లు చాల వరకు సహాయం అందిస్తున్నారు. కానీ అవి అందరికి ముఖ్యం గా అవసరమైన వారికి అవి చేరడం లేదు దాని ప్రాణ నష్టం , డబ్బు వృధా , జీవితాలు అవుతున్నాయి.
అందుకే ఇలాంటి ముఖ్యమైన సమాచారం అందుబాటులో ఉంచడం కోసమే ఈ బ్లాగ్ తయారు చేసాము. ఇందులో ఉన్న సమాచారం మేము వివిధ పత్రికలూ, బ్లాగ్స్, ఇంటర్నెట్, ఫేస్బుక్, వాటప్ వంటి సోషల్ మీడియా ద్వారా మాకు అందిన సమాచారాన్ని మీకు అందుబాటులో ఉంచుతాము. ఇది మీకు లేదా మీకు తెలిసిన వాళ్లకి ఏమైనా సహాయ పడితే అంతేచాలు.
ధన్యవాదములు.
కర్త-కర్మ బ్లాగ్ టీం.

Comments
Post a Comment